రాష్ట్రంలోని హస్తకళల కళాకారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర అందించి.. వారికి జీవనోపాధి కల్పించేందుకు హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ముఖ్య కార్యనిర్వహణధికారి బి.జయరాజ్ తెలిపారు. గుంటూరులోని కె.కె.ఆర్ ఫంక్షన్‌హాల్‌లో శిల్పారామం హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్–2021ను బి. జయరాజ్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన హస్తకళల స్టాల్స్‌ను పరిశీలించారు.
హస్తకళల కళాకారుల ఉత్పత్తులను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకోవడానికి హ్యాండీ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ –2021ను మార్చి 2 నుంచి 11 వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్‌లో 12 రాష్ట్రాలకు చెందిన 58 మంది హస్తకళల కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు. మన ప్రాచీన సాంప్రదాయాలు, కళలను భవిష్యత్తుతరాలకు అందించటానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శిల్పారామాలను నెలకొల్పుతున్నామని చెప్పారు.
కరోనా వైరస్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన హస్త కళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ హ్యాండీ క్రాప్ట్ సర్వీసింగ్ సెంటర్ అసిస్టెంట్ డైరక్టర్ (హ్యాండీ క్రాఫ్ట్) డా. మనోజ్ లంకా, ఏపీ శిల్పారామం హ్యాండీక్రాప్ట్ ప్రమోషన్ ఆఫీసర్ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: