గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష హత్యకు నిరసనగా తెనాలిలో ర్యాలీ చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం సాయిబాబా గుడి వంతెన వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. అనూష హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే భవిష్యత్తులో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి. తంగిరాల సౌమ్య, కుటుంబసభ్యులను పరామర్శించిన నారా లోకేశ్