ఒక్క కేసు కూడా లేని గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మూడు రోజుల వ్యవధిలో ఏడు కేసులు నమోదయ్యాయి. దాచేపల్లి నుంచి పిడుగురాళ్ల అత్తారింటికి వచ్చిన ఓ వ్యక్తి గత నెలలో పాజిటివ్ వచ్చింది. మూడు రోజుల క్రితం హైదరాబాదు నుంచి వచ్చిన వ్యక్తికి, మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ఇద్దరికి, ఓ దుకాణపు యజమానికి, ఆర్టీసీ బస్టాండ్లో మెకానిక్కు కోవిడ్ నిర్ధరణ అయ్యింది. 7 కేసులలో 4 కేసులు హైదరాబాద్ నుంచి వచ్చినవని అధికారులు తెలిపారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాలలో రసాయనాల పిచికారీ చేయిస్తున్నారు.
ఇదీ చూడండి. కృష్ణా జిల్లాలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి దారుణ హత్య... పెదగౌడపాలెం కలకలం