పాల వాహనంలో అక్రమంగా పీడీఎస్ రైస్‌ను తరలిస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను గుంటూరు అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.35 లక్షల విలువ చేసే పీడీఎస్ బియ్యం, పాల వాహనం, టాటాఏస్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ సుప్రజ తెలిపారు.
గుంటూరు శారదాకాలనికి చెందిన మరియమ్మ అదే ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పీడీఎస్ బియ్యన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వాటిని అధిక ధరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. మరియమ్మకు సహకరిస్తున్న రమేష్, సాంబశివరావు, లక్ష్మీనారాయణ, బాబి, శివమ్మలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఇదీ చూడండి: బిడ్డకు పాలిస్తుండగా.. అమ్మ స్తనంపై పాముకాటు