ETV Bharat / state

మేము వ్యాపారం ఎలా చేసుకోవాలో మీరే చెప్పండి సార్​..!

author img

By

Published : Jun 6, 2020, 3:10 PM IST

రైతులకు అన్ని విధాలా ఉపయోగపడేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ కేవలం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీల విత్తనాలు మాత్రమే రైతులకు అందిస్తారు. ఆర్​బీకేలలో దొరికే విత్తనాలను బయట అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిషేధం విధించారు. డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలను అమ్మకుండా అడ్డుకోవటాన్ని డీలర్లు తప్పుబడుతున్నారు.

seed shops sales
seed shops sales

రాష్ట్రంలో అత్యధికంగా మిర్చి పంట గుంటూరు జిల్లాలో సాగవుతోంది. గతేడాది లక్షా 80వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట వేశారు. జిల్లాలో ఈసారి 2లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు తగ్గట్లుగా 16వందల కిలోల విత్తనాలు అవసరమని తేల్చారు. ఈ మేరకు విత్తన కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. వారు ఎంత విత్తనం సరఫరా చేయగలరో వివరాలు తీసుకున్నారు. హైబ్రిడ్ రకాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అందులో తేజ, యుఎస్ 340, నంబర్ 5, సూపర్ 10 వంటివి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఓపీ రకాలకు డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో అవసరాలను బట్టి విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు.

రైతులు తమకు కావాల్సిన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ సంస్థ ఆగ్రోస్​తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీల విత్తనాలు మాత్రమే రైతు భరోసా కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. మంచి డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలను ఎంఓయూలోకి తెచ్చామని... అందులో రెండు కంపెనీలతో ఎంఓయూ పూర్తయినట్లు చెబుతున్నారు.

అయితే తొలకరి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. రైతులు గతంలో తమకు నచ్చిన కంపెనీల విత్తనాలు డీలర్ల నుంచి కొనుగోలు చేసేవారు. ఈ సారి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అక్కడ డబ్బు చెల్లించిన వారికి మాత్రమే 48 గంటల్లో విత్తనాలు సరఫరా చేస్తారు. ఆర్​బీకేలలో దొరికే విత్తనాలను బయట అమ్మకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిషేధం విధించారు. ఒకవేళ రైతులు బయట డీలర్ల వద్ద అవే విత్తనాలు కొనాలంటే అవకాశం లేకుండా పోయింది.

డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలను అమ్మకుండా అడ్డుకోవటాన్ని డీలర్లు తప్పుబడుతున్నారు. తమని వ్యాపారం చేయకుండా అడ్డుకోవటం చట్టవిరుద్ధమని డీలర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం ముందే చెప్పి ఉంటే తాము సరుకు తెప్పించకుండా జాగ్రత్త పడేవాళ్లమని... ఇపుడు అదంతా వెనక్కు ఇస్తే నష్టపోతామని అంటున్నారు. ఆర్.బీ.కేలలో విత్తన విక్రయాల శాతాన్ని పెంచేందుకే డీలర్లు విత్తనాలు అమ్మకుండా అధికారులు అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి. తమకూ వ్యాపార అవకాశం కల్పించాలని డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.