నరసరావుపేటలో మళ్లీ లాక్డౌన్ ప్రారంభం కానున్నట్లు సబ్‌కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం నుంచి నరసరావుపేటలో ఆంక్షలతో కూడిన లాక్డౌన్ ఉంటుందని స్పష్టం చేశారు. నరసరావుపేట పట్టణంలో గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు పూర్తి లాక్డౌన్ కొనసాగుతుందని వివరించారు. ప్రజలందరూ కరోనా ప్రభావాన్ని గమనించి తప్పకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండీ... కొవిడ్ నియంత్రణకు మాస్కు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు