ETV Bharat / state

రెండున్నర కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు అరెస్ట్ - తెనాలిలో ఎస్​ఈబీ అధికారుల దాడులు వార్తలు

గుంటూరు జిల్లా తెనాలిలో ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. రెండున్నర కిలోల గంజాయి పట్టుబడింది. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

seb officials seized marijuana at tenali
ఎస్​ఈబీ అధికారుల అదుపులో గంజాయి నిందితులు
author img

By

Published : Mar 28, 2021, 12:26 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలో రెండున్నర కిలోల గంజాయి దొరికింది. పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీలో ఎస్​ఈబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో రూ. 2 లక్షలు విలువ చేసే గంజాయితోపాటు 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో ముగ్గురు వ్యక్తులు చంద్రబాబునాయుడు కాలనీవాసులు కాగా.. ఇద్దరు విశాఖపట్నానికి చెందినవారని ఎస్ఈబీ ఏఈఎస్ నరసింహారావు తెలిపారు. గత మూడు నెలలుగా నుంచి నిందితులు గంజాయిని విక్రయిస్తున్నారని ఆయన అన్నారు. రేపల్లెలోనూ ఓ మహిళ నుంచి వంద గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నరసింహారావు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

'మా భూములు మా దగ్గరే ఉన్నాయి.. ఎవరి ప్రలోభాలకు లోనవలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.