ETV Bharat / state

'వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై దాడులు పెరిగాయి' - ఫిరంగిపురం తెదేపా నేతలు వార్తలు

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయని గుంటూరు జిల్లా ఫిరంగిఫురం తెదేపా నేతలు ఆరోపించారు. ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిరంగిపురం ఇన్​ఛార్జ్ ఎస్సై వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు.

tdp leaders
ఫిరంగిపురం తెదేపా నేతలు
author img

By

Published : Jul 22, 2020, 7:13 PM IST

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు ఎక్కువయ్యాయని గుంటూరు జిల్లా ఫిరంగిపురం తెదేపా ఎస్సీ నేతలు ఆరోపించారు. ఎస్సీలపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... ఇన్​ఛార్జ్ ఎస్సై వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఎస్సీ వైద్యుడు సుధాకర్​పై చేసిన దాడి చాలా బాధాకరమని అన్నారు.

చిత్తూరు జిల్లాలో మరో ఎస్సీ వైద్యురాలు అనితను అవమానించిన తీరు హేయమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కొత్తకోటకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేయటం బాధాకరమని అన్నారు. పల్నాడుకు చెందిన ఎస్సీ విక్రమ్​పై దాడి చేసి చంపిన విధానం దురదృష్టకరమన్నారు. ఎస్సీలను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్సైను కోరారు.

ఇదీ చదవండి: ఆ రెండు బిల్లులు ఆమెదించవద్దని.. గవర్నర్ బొమ్మకు వినతిపత్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.