గుంటూరు జిల్లాలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దుగ్గిరాలలోని ఎస్బీఐలో పని చేస్తున్న ఏడుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అలాగే చైతన్య గోదావరి బ్యాంకులో మరో ఐదుగురికి వైరస్ సోకింది. ఈ కారణంగా.. 3 రోజులపాటు ఆ 2 బ్యాంకులు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.
బ్యాంకులో పని చేస్తున్న మిగతా ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు చేయిస్తున్నారు. గత నాలుగు రోజులుగా బ్యాంకులకు వచ్చిన వినియోగదారులు కూడా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఇవీ చూడండి: