తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును బుధవారం సత్తెనపల్లి తెదేపా శ్రేణులు గుంటూరులో కలిశారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై అధినేతకు వివరించారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్రావును మార్చి మరొకరికి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని విన్నవించారు. ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని... పోటీచేస్తే ఓడిపోతారని చెప్పినా టికెట్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగబాబు సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. నాయకులు, కార్యకర్తలతో నేడు సమావేశం నిర్వహించారు. మరోవైపు కోడెల తన కార్యాలయంలో తనకు మద్దతుగా ఉన్న నేతలతో సమావేశం నిర్వహించారు. ఇంఛార్జ్ ఎంపిక బాధ్యతలు అధినేత చూసుకుంటారని నేతలకు తెలిపారు.
ఇదీ చదవండి... 'నిర్మాణరంగ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి'