ఏడు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ రాజధాని పారిశుద్ధ్య కార్మికులు గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో 29 గ్రామాల పారిశుద్ధ్య కార్మికులు బకాయిల చెల్లించాలని సీఆర్డీఏ కార్యాలయం ముందు బైఠాయించారు.
ప్రాణాలు ఫణంగా పెట్టాం..
కరోనా సమయంలోనూ తమ ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకు సేవలు అందించామని పారిశుద్ధ్య కార్మికుల వెల్లడించారు. తమపై పూలు చల్లిన అధికారులే ఇప్పుడు జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జీతాలు లేకనే..
జీతాలు లేక పచ్చడి మెతుకులు తింటున్నామని కార్మికులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీతాలు విడుదల చేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్కే దక్కుతుంది: సీఎం జగన్