ETV Bharat / state

నేటి నుంచి సంగం పాల సేకరణ ధరల పెంపు

పాల ఉత్పత్తిదారులకు అండగా నిలిచేందుకు సంగం డెయిరీ పాలసేకరణ ధరలను పెంచింది. పాడి రైతులకు రూ.45 కోట్ల బోనస్‌ ఇస్తామని డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ వెల్లడించారు.

Sangam milk procurement price hike from today
సంగం పాలు
author img

By

Published : Apr 1, 2021, 10:31 AM IST

పాల ఉత్పత్తిదారులకు అండగా నిలవాలనే ఆకాంక్షతో ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి గేదె పాల సేకరణ ధరను లీటరుకు రూ.1.50, ఆవు పాల ధరను రూ.1.20 చొప్పున పెంచుతున్నట్టు సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. బుధవారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని డెయిరీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

గుంటూరు, చిత్తూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లోని పాడి రైతులకు రూ.45 కోట్ల బోనస్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. వచ్చే 5 నెలల్లో లక్ష లీటర్ల ఉత్పత్తే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రైతుల సంక్షేమం కోసం వరి, మినుము, పెసర, మిర్చి, కూరగాయల విత్తనాలను తయారుచేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందించామని ఆయన వివరించారు.

ఇదీ చూడండి. భట్టిప్రోలు మండలంలో వారంరోజులపాటు లాక్‌డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.