గుంటూరులో బహిరంగ ప్రదేశాల్లో నిత్యావసరాల పంపిణీపై అధికారుల ఆంక్షలు విధించారు. పార్టీలు, స్వచ్ఛంద సంస్థల నిత్యావసరాల పంపిణీపై కలెక్టర్ శామ్యూల్ ఆదేశాలు చేశారు. పట్టణాల్లో కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లకు సరకులు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మెప్మా, డ్వాక్రా, వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ సరకులు పంపిస్తామని పాలనాధికారి వివరించారు. ఈ విషయంలో ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ శామ్యూల్ హెచ్చరించారు.
ఇదీ చదవండీ... కరోనా నుంచి బయటపడినా మళ్లీ సోకనుందా..?