ETV Bharat / state

Rythu kosam telugudesam: తప్పు చేసి ఉంటే శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా.. దాచేపల్లి సభలో యరపతినేని - tdp rally for farmers at dachepalli

rythu kosam telugudesam in dachepalli: పల్నాడులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొస్తామని.. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవొద్దని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అన్యాయాలు, అరాచకాలు చేస్తున్న వైకాపా నాయకులకు చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో నిర్వహించిన రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

rythu kosam telugudesam in dachepalli
rythu kosam telugudesam in dachepalli
author img

By

Published : Dec 15, 2021, 9:45 AM IST

rythu kosam telugudesam in dachepalli: గుంటూరు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవసభ.. ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమాన్ని(రైతు కోసం తెలుగుదేశం) నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్లబండ్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. నేను తప్పు చేసి ఉంటే.. శిరస్సు వంచి క్షమాపణ చెబుతున్నా.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దాచేపల్లి సభలో ఉద్వేగానికి లోనయ్యారు. మన మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గురజాల సహా రాష్ట్రంలో పార్టీని పట్టుదలతో గెలిపించుకుందామని చెప్పారు. నాయకులు, కార్యకర్తల గౌరవాన్ని కాపాడతానన్నారు. తాను మారానని.. మరింత మారతానంటూ పదేపదే చెప్పారు. జనవరి నుంచి ప్రతి గ్రామంలో తిరిగి, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా కలుస్తానన్నారు.

పల్నాడులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొవస్తాం

పల్నాడులో తెదేపాకు పూర్వ వైభవం తీసుకొవస్తామని.. నాయకులు, కార్యకర్తలు అధైర్యపడవొద్దని యరపతినేని శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. అన్యాయాలు, అరాచకాలు చేస్తున్న వైకాపా నాయకులకు చట్ట ప్రకారం శిక్ష తప్పదని.. వాళ్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో దాక్కున్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తామర పురుగుతో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జగన్​ను గెలిపించినందుకు బాదపడుతున్నారు: నక్కా ఆనందబాబు

జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రైతులకు పరిహారం అందలేదని.. పంట నష్టం గణన కూడా పూర్తి స్థాయిలో జరపలేదని ఆనందబాబు ఆరోపించారు. గతేడాది ప్రభుత్వపరంగా చెల్లించాల్సిన బీమా సొమ్మును ఇంతవరకు చెల్లించలేదని పేర్కొన్నారు. అనంతరం సభలో దాచేపల్లి తెదేపా కౌన్సిలర్లు ఏడుగురిని ఘనంగా సన్మానించారు.

ఇదీ చదవండి..

prc:ఐఆర్‌ ఇస్తున్నదే 27%.. ఫిట్‌మెంట్‌ 14.29% అంటే ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.