నరసరావుపేట నియోజకవర్గంలో వైకాపా నేతల వేధింపులు కొనసాగుతున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని.. లేదంటే అక్రమ కేసులు బనాయిస్తామని స్థానిక సీఐ క్రిష్ణయ్య బెదిరిస్తున్నారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, గ్రామీణ ఎస్పీ, ఎన్నికల అధికారులను కోరుతూ.. పలువురు సీఐ తీరుపై ఫిర్యాదు చేశారు.
ఏకగ్రీవాలకు విశ్వ ప్రయత్నాలు...
ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు వైకాపా మద్దతుదారులు విశ్వ ప్రయత్నాలు చేసిన ఘటనలు ఉన్నాయి. వాటిని తెదేపా నేతలు తిప్పికొట్టి ఎత్తులకు పైఎత్తులు వేశారు. సర్పంచ్ అభ్యర్థి భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో.. ఆమె కోసం అధికార పార్టీ నేతలు ఆసుపత్రి బయటే గంటల కొద్దీ నిరీక్షించారు. చివరకు సమయం మించిపోవటంతో వెనుతిరిగారు. ప్రత్యర్థి అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకునేలా వైకాపా ప్రయత్నించగా.. తెదేపా వాళ్లు తమ అభ్యర్థులను దాచిపెట్టారు. సమయం మించిపోయిన అనంతరం అధికార పార్టీ నేతలు అభ్యర్థులను తీసుకొచ్చి ఏకగ్రీవం చేయాలని కోరటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవీ చూడండి..