ETV Bharat / state

రూ. 44 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత - అక్రమ మద్యం పట్టివేత న్యూస్

రూ. 44 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు పట్టుకున్నారు. గోవా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణలో నిల్వ ఉంచి గుంటూరుకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

రూ. 44 లక్షల విలువైన అక్రమ మద్యం పట్టివేత

author img

By

Published : Mar 13, 2021, 8:40 PM IST

గోవా నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న రూ.44 లక్షల విలువచేసే మద్యాన్ని ఎస్​ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్​ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్​లాల్ తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంగి గ్రామానికి చెందిన రామావత్ అశోక్ నాయక్ గోవాలో తక్కువ ధరకి మద్యాన్ని కొనుగోలు చేసి జిల్లాలోని పలు ప్రాంతాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నటు తెలిపారు. అక్రమ మద్యాన్ని సిమెంట్ బల్కర్ లారీలో లోడ్ చేసుకుని ఏపీకి నేరుగా కాకుండా..తెలంగాణ మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో నిల్వ ఉంచి అక్కడ నుంచి కొద్దికొద్దిగా గుంటూరు జిల్లాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. పక్కా సమాచారం అందుకున్న ఎస్​ఈబీ...సంగారెడ్డిలో ఉన్న లారీ, ఓ కారు, మద్యం సీసాలను స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.

ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.44 లక్షల విలువ చేసే 523 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నామన్నారు. లారీ, కారును సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ఇదీచదవండి

ప్రైవేటీకరణ వద్దంటూ.. ప్రత్యేక హోదా కోరుతూ.. దిల్లీలో ఏపీ కాంగ్రెస్ నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.