మొక్కలు పెంచేందుకు కావాల్సిన సామాగ్రిని సొంత డబ్బుతోనే కొనుగోలు చేసిన ఆయన.. సామాజిక మాధ్యమాల ద్వారా మొక్కల పెంపకం నేర్చుకున్నారు. లాక్‌డౌన్‌లో ఖాళీ సమయం దొరకటంతో.. ఉపాధ్యాయులతో కలసి మిద్దెపై వ్యవసాయం ఆరంభించారు. ఇక్కడ పండించిన కూరగాయలు, ఆకుకూరలనే మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. సేంద్రియ విధానంలోనే వీటిని పెంచామని తెలిపారు.
భవనం.. పచ్చదనం..
మిద్దె వ్యవసాయంతో తమ పాఠశాల భవనం పచ్చదనంతో నిండిపోయిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. అవసరమైనప్పుడు పూడికతీసి నీళ్లు పోస్తామని తెలిపారు. తమ ఇంట్లోనూ మొక్కలు పెంచుతామన్నారు. విద్యార్థి దశలోనే వ్యవసాయం నేర్చుకోవటంతో పిల్లల్లో ఒత్తిడి తగ్గి పాఠశాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని ఉపాధ్యాయులు తెలిపారు.
పాఠశాల భవనం దెబ్బతినకుండా..
పాఠశాల భవనం దెబ్బతినకుండా రక్షణగా 250 మ్యాట్లను వేసి వాటిపై ఏర్పాటు చేసిన గ్రీన్ బ్యాగ్, గ్రౌండ్ బ్యాగులతో మొక్కల పెంపకం చేపట్టారు. ఎండవేడిమి నుంచి మొక్కల సంరక్షణకు గ్రీన్ నెట్ ఏర్పాటు చేశారు. గ్రామంలోని రైతులు నుంచి పశువుల సేకరించి.. దానిలో వర్మి కంపోస్టు కలిపి మొక్కలకు వేస్తున్నారు. బిందు సేద్య విధానంలో మొక్కలన్నింటికీ నీటిని అందిస్తున్నారు.
ఇదీ చదవండి: