ETV Bharat / state

ACCIDENT: తెనాలిలో ప్రమాదం.. లారీ ఢీకొని తల్లి, కుమార్తె మృతి - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు

accident: తెనాలిలో లారీ ఢీకొని తల్లి, కుమార్తె మృతి

author img

By

Published : Sep 14, 2021, 5:53 PM IST

Updated : Sep 14, 2021, 8:21 PM IST

17:04 September 14

Gnt_Gnt accident_Mother Daughter Dead_Breaking

accident: తెనాలిలో లారీ ఢీకొని తల్లి, కుమార్తె మృతి

పాఠశాల నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో.. తల్లీబిడ్డను మృత్యువు కబళించింది. గుంటూరు జిల్లా తెనాలిలో తల్లి హసీనా.. తన కుమార్తె అప్సాను పాఠశాల ముగిసిన తర్వాత ద్విచక్రవాహనంపై తీసుకెళ్తోంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ వద్ద అతివేగంతో వచ్చిన లారీ బలంగా స్కూటీని ఢీకొనడంతో తల్లీకుమార్తె ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.

 ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాలను చూసి విలపించారు. ఘటనపై మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి:

Live Video: వినాయక నిమజ్జనంలో అలజడి... అసలేం జరిగింది..!

Last Updated : Sep 14, 2021, 8:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.