గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన ఆర్ఎంపీ మస్తాన్ వలి కొవిడ్‌తో మరణించారు. పది రోజుల క్రితం ఆయనకు జ్వరం రావటంతో.. కరోనా పరీక్ష చేయించారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో.. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. రాత్రి శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటంతో.. వైద్యులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. మస్తాన్ వలి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భాజపా మైనార్టీ మోర్చాలో రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా ఉన్నారు.
ఇవీ చూడండి...