1975లో అప్పటి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని 250 మంది నిరుపేద ఎస్సీ ఎస్టీలకు సర్వే నంబర్ 381లో 416.50 ఎకరాల భూమిని కేటాయించింది.‘‘యడవల్లి వీకర్స్ సెక్షన్ ల్యాండ్ కాలనైజేషన్ సొసైటీ లిమిటెడ్’’ పేరుతో అప్పట్లో ఎస్సీ ఎస్టీలు ఒక సొసైటీగా ఏర్పడగా.. ఏక పట్టాగా వారికి భూములు అందజేశారు. 2015లో వాటిని ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. అప్పట్లో పాదయాత్రకు వచ్చిన వైఎస్ జగన్కు రైతులు వినతి పత్రం అందజేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు సొసైటీకే ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు పేదలకే భూములు చెందేలా నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే రజిని తెలిపారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సొసైటీ భూములు కాజేయాలని చూశారని ఆమె విమర్శించారు.
ఇవీ చూడండి...