Retired IAS Officer Gopal Rao : ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో ఎస్సీలపై దాడులు, వేధింపులు అధికమయ్యాయని.. విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ గోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అంశంపై గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం ఊహకు కూడా అందని దారుణమని గోపాలరావు ఆక్షేపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీలపై జరిగిన దమనకాండలను ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ప్రస్తావనే రాకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. నిధులు, అధికారాలు లేని కార్పొరేషన్లు, ఛైర్మన్ పదవులు ఎందుకని.. జనచైతన్య వేదిక అధ్యక్షుడు వీ లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. డ్రైవర్‌ను చంపి జైలుకు వెళ్లొచ్చిన ఓ నాయకుడికి ప్రజలు ఘనస్వాగతం పలకడం చూస్తే.. సమాజం ఎటువెళ్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
" గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అశ్చర్యకరమైన పరిణామం చేసుకుంటుంది. దళితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు చేయటం జరుగుతుంది. చాలా సిగ్గు చేటైనా చర్య ఇది. "-టీ గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి
"చాలా మందిని డిప్యూటీ సీఎంలుగా, కార్పోరేషన్ ఛైర్మన్లుగా నియమిస్తున్నారు. నియమితులైనా వారి కార్యకలపాలను సక్రమంగా నిర్వహించటానికి సరైన విధులు, నిధులు లేవు. జైలు నుంచి బయటకు వచ్చినా ఓ నాయకుడికి.. ప్రజలు పూల మాలాలు వేసి ఘన స్వాగతం పలుకుతున్నారు. అసలు ఈ సమాజం ఎటు పోతుంది." -లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు
ఇవీ చదవండి: