ETV Bharat / state

కథనానికి స్పందన... అడంగల్​లో మార్పులు చేసిన అధికారులు - land-scam-in-thadikonda-guntur-district

గుంటూరు జిల్లా తాడికొండ భూ రికార్డు(land records)ల్లో పేర్ల మార్పుపై ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి(EENADU-ETV-ETV BHARAT story) స్పందన లభించింది. అడంగల్‌లో లీజుదారుల పేర్లను రెవెన్యూ అధికారులు తొలగించారు. జడ్పీ భూములుగా పేర్కొంటూ అడంగల్‌(aadangal)లో మార్పులు చేశారు. ఈ అంశంపై ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్​లో కథనాలు(stories) ప్రచురితమయ్యాయి.

తాడికొండ తహసీల్దార్ కార్యాలయం
తాడికొండ తహసీల్దార్ కార్యాలయం
author img

By

Published : Jul 17, 2021, 10:59 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ భూ రికార్డు(land records)ల్లో జెడ్పీ భూముల పేర్లు మార్పుపై ఈటీవీ-ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి(EENADU-ETV-ETV BHARAT) అధికారులు స్పందించారు. లీజుదారుడి పేరుని హక్కుదారుడిగా ఎలా నమోదు చేస్తారని సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్(collector dinesh kumar).. తహసీల్దార్​ను ప్రశ్నించారు. అడంగల్ లో మార్పులు చేయాలని ఆదేశించారు. వెంటనే అడంగల్ లో లీజుదారుల పేర్లను తొలగించిన అధికారులు.. ఆ భూములన్నీ జెడ్పీ భూములుగా పేర్కొంటూ మార్పులు చేశారు. రికార్డుల తారుమారు జరిగిన మూడు సర్వే నంబర్లలోని భూములను తిరిగి జెడ్పీ భూములుగా నమోదు చేశారు.

తాడికొండ తహసీల్దార్ కార్యాలయం
తాడికొండ తహసీల్దార్ కార్యాలయం

సర్వే నంబర్ 10-1బి లో 47 సెంట్లు, సర్వే నంబర్ 12-2ఏలో 6 సెంట్లు భూములున్నాయి. ఈ రెండింటికి సంబంధించి హక్కుదారు విభాగంలో జెడ్పీ భూములుగా మార్చారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు డిజిటల్ సంతకం కూడా చేశారు. ఇక 1467బిలో 4ఎకరాల 18 సెంట్ల భూమికి సంబంధించి మాత్రం ఇంకా డిజిటల్ సంతకం పూర్తి కాలేదు. దీంతో ఆ విభాగం కాషాయం రంగులో ఉంది. అయితే యజమాని వద్ద మాత్రం జెడ్పీ భూములుగా నమోదు చేశారు. ఇక ఈ పేర్ల మార్పు వ్యవహారంపై అంతర్గత విచారణ కూడా చేపట్టారు.

ఇవీచదవండి.

NO PERMISSION: 'చలో తాడేపల్లి'కి పోలీసుల అనుమతి నిరాకరణ

TELANGANA: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.