కరోనా కట్టడిలో వాలంటీర్ల వ్యవస్థను సరిగా ఉపయోగించుకోకపోవటం వల్లే కేసులు ఎక్కువవుతున్నాయని ఆర్థిక అంశాల పరిశోధకులు రామమోహన్ అభిప్రాయపడ్డారు. కేరళలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా.. కోవిడ్‌ని కట్టడి చేశారని తెలిపారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌన్సిలర్ ఉండాలని 2015లోనే తాను కేంద్ర ప్రభుత్వానికి సూచించానన్నారు. మన రాష్ట్రంలో అదే విధానంతో వాలంటీర్ల వ్యవస్థ వచ్చినట్లు తెలిపారు. కేంద్రం ఎఫ్ఆర్బీఎం చట్ట సవరణ ద్వారా రాష్ట్రాలకు రుణాల వెసులుబాటు కల్పించటం ఆహ్వానించదగిన పరిణామమన్నారు.
ఇదీ చూడండి.
పుట్టను తవ్విన శునకాలు.. బయటపడ్డ అయ్యప్ప విగ్రహం