గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్కు లేఖ రాశారు. వైకాపా నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి... నూతన పాలసీ పేరుతో మాఫియాకు రూపకల్పన చేశారని ఆరోపించారు. నదులు, చెరువులు, వాగులు, వంకలను వదలకుండా ఇసుక తవ్వేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో 1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర ఇప్పుడు 5 వేలకు చేరిందన్నారు. 10వేలు ఉన్న లారీ ఇసుక 50వేల నుంచి లక్ష వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమాలపై ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 14500కు సమాచారం అందించినా కన్నెత్తి చూసేవారే లేరంటూ లేఖలో ప్రస్తావించారు.
'అధికార పార్టీ నేతల ఇసుక మాఫియా మీకు కనిపించట్లేదా..?' - రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తాజా
రాష్ట్రం అధికార పార్టీ నేతల ఇసుక దోపిడీ కనిపించడం లేదా అని... సీఎం జగన్ను తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. వైకాపా నేతల స్వార్థ ప్రయోజనాల కోసం భావితరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారంటూ సీఎం జగన్కు లేఖ రాశారు.
గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సీఎం జగన్కు లేఖ రాశారు. వైకాపా నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి... నూతన పాలసీ పేరుతో మాఫియాకు రూపకల్పన చేశారని ఆరోపించారు. నదులు, చెరువులు, వాగులు, వంకలను వదలకుండా ఇసుక తవ్వేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో 1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక ధర ఇప్పుడు 5 వేలకు చేరిందన్నారు. 10వేలు ఉన్న లారీ ఇసుక 50వేల నుంచి లక్ష వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమాలపై ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 14500కు సమాచారం అందించినా కన్నెత్తి చూసేవారే లేరంటూ లేఖలో ప్రస్తావించారు.
ఇవీ చూడండి-అంచనాలు తప్పుతున్న రాష్ట్ర ఆదాయం