గుంటూరు జిల్లా నరసరావుపేటలో రెడ్‌జోన్ ప్రాంతాల పరిధిని తగ్గిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రేపటినుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు లాక్డౌన్ సడలింపులు ఉంటాయని తెలిపారు. రెస్టారెంట్లు, తోపుడు బండ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనుమతులు ఇచ్చిన దుకాణాల్లో శానిటైజర్, మాస్కులు వాడాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. మాస్కులు లేకుండా రోడ్లపై తిరిగే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.
గ్రీన్‌జోన్‌గా ఉండే ప్రాంతాలు:
రామిరెడ్డిపేట, ఇస్లాంపేట, పెద్దచెరువు, ఎన్జీవో కాలనీ.
రెడ్ జోన్ నుంచి గ్రీన్‌జోన్‌గా మారే ప్రాంతాలు:
నిమ్మతోట, ప్రకాశ్‌నగర్ 14వ వార్డు.
ఇదీ చదవండి: వైకాపా దాడులు శ్రుతిమించిపోయాయి: చంద్రబాబు