గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్లో ఇసుక అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ వీరారెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ఇస్సపాలెంలో ఇసుక డంప్ యార్డ్‌ను ప్రారంభించినట్లుగా ఆయన తెలిపారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ యజమాని ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇసుకను ఇక్కడినుంచి తీసుకువెళ్లే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి ఒక్క వాహనదారుడు వారికి ఇచ్చిన రూట్లకు మాత్రమే ఇసుక రవాణా చేయాలన్నారు. ఇసుకను అక్రమంగా తరలించకుండా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఏరియాల ఎస్సైలు అనుమానం వచ్చిన వాహనాలను ఆపితే సరైన పత్రాలు చూపించాలని తెలిపారు. పల్లె ప్రాంతంలో కాలువల వద్ద దొరికే ఇసుకను తహసీల్దార్ అనుమతి పత్రం తీసుకున్న తరువాతనే తరలించాలని తెలిపారు. మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని డీఎస్పీ అన్నారు.
ఇదీ చదవండి:'దరఖాస్తు చేసుకున్న 2 గంటల్లోనే ఇసుక సరఫరా'