ETV Bharat / state

జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల కోసం సిఫార్సు - national teachers awards news

జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ఆరుగురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు పంపింది. కరోనా మహమ్మారి కారణంగా తుది ఎంపికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.

recommendations for teachers awards
జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల కోసం సిఫార్సు
author img

By

Published : Aug 11, 2020, 11:03 PM IST

జాతీయ ఉపాధ్యాయ పురస్కారాల కోసం ఆరుగురిని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి, విజయవాడ వీరపనేనిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎం సురేష్, ఒంగోలు మంగమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.రమేష్, శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు, విజయనగరం జిల్లా డీవై పాలెం మండల ప్రజా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయురాలు దంతులూరి రమాదేవి, విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ బంగారమ్మ పేట మున్సిపల్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రజినీకాంత్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖకు పంపింది.

కరోనా పరిస్థితుల వల్ల ఈ ఏడాది తుది ఎంపిక ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు. ఈ నెల 13న తుది ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ రోజు ఉపాధ్యాయులు గూగుల్ మీట్ ద్వారా 10 నిమిషాలు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఆరుగురు ఉపాధ్యాయులకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

ఇదీ చదవండి:

తుళ్లూరులో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.