భాజపా నేత రావెల కిశోర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన గాంధీజీ సంకల్ప యాత్ర పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురుకు చేరుకుంది. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యాత్ర చేపట్టామని కిశోర్ బాబు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామన్నారు. ఈనెల 31న గుంటూరుకు చేరుకోవటంతో యాత్ర ముగుస్తుందనీ.. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..