గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పన్నెండేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. ఆ బాలిక తాతయ్య, అమ్మమ్మ వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇంటికి సమీపంలోని పెద్దమ్మ కాలనీలో నివాసముండే కట్టా విజయ్ కుమార్.. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి.. మద్యం తాగి వెళ్లాడు. అత్యాచారయత్నం చేయగా.. ఆమె బిగ్గరగా అరిచింది. ఇంతలోనే పని నుంచి వచ్చిన తాతయ్య గమనించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బాపట్ల ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: