గుంటూరు రైల్వే స్టేషన్లోని బోగీల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. రైల్వే క్వార్టర్ సమీపంలోని రైల్వే రక్షణ దళం విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ బెడ్లను పరిశీలించిన కొవిడ్ -19 జిల్లా ప్రత్యేక అధికారి రాజ శేఖర్, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిల్లాలో వున్న పరిస్థితుల దృష్ట్యా రైల్వే శాఖ సౌకర్యాలను వినియోగించుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు వున్న వారిని ఐసోలేషన్ లో ఉంచేందుకు బోగీలను ఇలా మార్పు చేసినట్లు గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ మోహన్ రాజ తెలిపారు. మరో 15 బోగీలను మార్పు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఇవీ చూడండి..