ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో గుంటూరు జిల్లా యంత్రాంగం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గుంటూరు జిల్లాలోని 85 ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల వైద్యులతో ప్రత్యేక అధికారి, కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రైవేటు ఆసుపత్రులను కోవిడ్ -19 ఆసుపత్రులుగా మారుస్తున్నామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఆస్పత్రుల పరిధిలో వైద్యులు, సిబ్బంది, బెడ్లు, వెంటిలేటర్స్ వివరాలు అందజేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: 'మేం ఇక్కడ ఉన్నాం.. మమ్మల్ని రాష్ట్రానికి తీసుకెళ్లండి'