తమ స్థలాలు ఇప్పించాలని కోరుతూ కొందరు గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. తమ స్థలాలను కబ్జాదారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుని భయపెడుతున్నారని వాపోయారు. సత్తెనపల్లిలోని 147వ సర్వేనంబర్ పరిధిలో 20 మంది 2007లో ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ఇటీవల కొందరు ఆ స్థలాన్ని అక్రమ రిజిస్ర్టేషన్ చేయించుకుని, పట్టాదారు పాసుపుస్తకం సైతం పుట్టించారని ఆందోళన వ్యక్తం చేశారు.
తాము కట్టుకున్న నిర్మాణాలను సైతం పడవేస్తూ, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కబ్జాదారులకు అండగా ఉన్నారని ఆరోపించారు. తమ సమస్యను పరిశీలించి పరిష్కారం చూపాలని బాధితులు కోరారు.
ఇదీ చదవండి: 'హైకోర్టు సీజే బెంచ్‌కు ప్రకటనల వ్యాజ్యం బదిలీ'