రాజధాని రైతుల త్యాగాలను తుంగలో తొక్కి... మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని అమరావతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 35వ రోజుకు చేరింది. ఈ నిరసనకు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. రైతులు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకుండా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టడం దారుణమన్నారు. తమ బతుకులు బుగ్గి చేసే బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తును బలి చేసిందని వాపోయారు. అమరావతిని సాధించుకునే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి