ETV Bharat / state

నిత్యావసరాల కోసం రెడ్​జోన్ ప్రాంత వాసుల ఇక్కట్లు

రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్​జోన్​గా గుర్తించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. అయితే ఆ ప్రాంతంలో నివాసముండే ప్రజలకు నిత్యావసరాలను ఇంటికే అందిస్తున్నారు అధికారులు. కానీ ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో మిగతా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

problems of redzone residence in guntur
గుంటూరులో రెడ్​జోన్ ప్రకటిత ప్రాంతం
author img

By

Published : Apr 13, 2020, 8:31 PM IST

గుంటూరు నగరంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంచార విక్రయ కేంద్రాల ద్వారా కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తున్నా.. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్ ప్రాంతాలతో ఎలాంటి దుకాణాలు తెరవటం లేదు. మందుల దుకాణాలు, పాల దుకాణాలు సైతం తెరవనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీచదవండి.

'మధ్యప్రదేశ్​ బలపరీక్షపై గవర్నర్​ నిర్ణయం సరైనదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.