కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న తమను ఆదుకోవాలంటూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట ప్రైవేటు టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు రిలే దీక్ష నిర్వహించారు. వారికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఏఎస్.రామకృష్ణ, తెదేపా నేతలు నసీర్ మహ్మద్ సంఘీభావం తెలిపారు.
భావి పౌరులను తీర్చిదిద్దే గురువులను ప్రభుత్వం రోడ్డుపైకి వచ్చేలా చేసిందని ఆనందబాబు మండిపడ్డారు. కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసిందని.. ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రభుత్వం వీరిని ఆదుకునేంత వరకు పోరాటాలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ రామకృష్ణ చెప్పారు.
ఇదీ చదవండి: