పిల్లలను క్రమశిక్షణలో పెట్టి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో ఉపాధ్యాయల పాత్ర ఎంతో ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయుడు కరోనా మహమ్మారి కారణంగా నేడు రోడ్డున పడ్డాడు. ప్రైవేటు సంస్థలో 1998 నుంచి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన హేమచంద్ర బాబు 5 నెలలుగా ఏ పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పాఠశాలలు తెరవకపోవడంతో ఉన్న ఒక్క ఆధారాన్ని కోల్పోయాడు. తనుకు తానూ పశ్చాత్తాపంగా గుండు గీసుకున్నాడు. కనీసం తమ సంస్థ కానీ... ప్రభుత్వం కానీ ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇదీ చదవండి: రాజధానిపై కౌంటర్ దాఖలుకు జనసేన నిర్ణయం