పదో తరగతి పరీక్షల కోసం వచ్చిన విద్యార్థుల్లో ఎవరైనా కరోనా భారిన పడితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రుల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థుల సత్తా ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకు భయపడే ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయని..., మన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేస్తామని ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ల సంఘం ప్రతినిధి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చూడండి మీ సేవ విధులు సచివాలయ సిబ్బందికి బదిలీ