గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చెరువు ప్రాంతంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కోడూరు నాగేశ్వరరావు... కరెంట్ స్తంభం వైర్లు కదుపుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. పైనుంచి కింద పడగా... తలకు తీవ్ర గాయమైంది.
రక్త స్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.