గుంటూరు జిల్లా నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా తంగెడమల్లి గ్రామానికి చెందిన శృంగవరపు విక్రమ్ అనే వ్యక్తి మృతి చెందాడు. వినుకొండ రోడ్డు నుంచి నరసరావుపేట మల్లమ్మ సెంటర్లోని ఫ్లై ఓవర్ పై ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది.
తీవ్రగాయాలపాలైన విక్రమ్ రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట ఒకటో పట్టణ ఎస్సై లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: