ETV Bharat / state

పౌల్ట్రీ రంగంపై కరోనా ప్రభావం తీవ్రం

కరోనా లాక్ డౌన్.. పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేస్తోంది. మొదట్లో కోడి మాంసం తింటే కరోనా వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేయగా.. ధరలు పడిపోయాయి. ఆ తర్వాత కోళ్ల పరిశ్రమకు అవసరమైన దాణా రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు చికెన్ దుకాణాలు మూసిస్తున్న కారణంగా.. కోళ్లన్నీ ఫారాల్లోనే మగ్గిపోతున్నాయి. ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే చికెన్ తినటం మంచిదని వైద్యులు సూచిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వం, అధికారులు లాక్ డౌన్ పేరిట చికెన్ విక్రయాలకు గండికొట్టడం పౌల్ట్రీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది.

poultry-problems
పౌల్ట్రీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం
author img

By

Published : Apr 10, 2020, 2:38 PM IST

పౌల్ట్రీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం

అందుబాటు ధరల్లో లభించే చికెన్, గుడ్లలోని పోషక విలువలు.. అన్ని వయసుల వారి ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తాయి. కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి చికెన్, గుడ్ల విక్రయాలపై ప్రభావం తీవ్రంగా పడింది. కొందరు సృష్టించిన అపోహలతో చికెన్ ధరలు బాగా పడిపోయాయి. ఈ సమయంలో చికెన్, గుడ్ల తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

దాణా లేక కోళ్లు చనిపోతున్నాయి..

గుంటూరు జిల్లాలో కోళ్ల పరిశ్రమ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వెలుగు చూసిన పరిస్థితుల్లో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కోళ్లకు దాణా తీసుకెళ్లేందుకు అనుకూల వాతావరణం లేకపోవటంతో పాటు ఫారాల వద్దకు కూలీలు, యజమానులు వెళ్లే అవకాశం లేక కోళ్లు చనిపోతున్నాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు పాసులు ఇచ్చినా.. పోలీసులు దాణాను అడ్డుకుని, వాహనాలు సీజ్ చేస్తున్నారు. దీనికి తోడు చికెన్ దుకాణాలు తెరవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారని... ఈ కారణంగా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్దేశిత సమయాల్లో దుకాణాలు తెరవనివ్వండి...

చికెన్ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడమే కాకు.. వైరస్ నివారణకు ప్రభుత్వం చెప్పిన సూచనలు ఆచరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోళ్ల రైతులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున.. మిగతా రోజుల్లోనైనా నిర్ధేశిత సమయాల్లో దుకాణాలు తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. లేకుంటే కోళ్లను ఫారాల్లోనే పూడ్చివేయటం తప్ప మరో మార్గం లేదని పెంపకందారులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవటంతో పాటు చికెన్ దుకాణాలు తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలని యజమానులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

కాకుల మరణం.. స్థానికుల్లో భయం భయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.