ETV Bharat / state

కోరం లేదని ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా.. తెదేపా నాయకుల ఆందోళన

author img

By

Published : Mar 15, 2021, 4:27 PM IST

కోరం లేదని ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేసిన ఘటన.. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయటంతో.. తెదేపా తరపు వార్డు సభ్యులు తహసీల్దారుతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని వారందరిని చెదరగొట్టారు.

postponement of  upa sarpanch elections in dharanikota at guntur
కోరం లేదని ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా.. తెదేపా నాయకుల ఆందోళన
కోరం లేదని ఉపసర్పంచ్ ఎన్నిక వాయిదా.. తెదేపా నాయకుల ఆందోళన

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామంలో.. ఉపసర్పంచ్ ఎన్నిక గందరగోళానికి దారి తీసింది. అధికారులు పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఉప సర్పంచి ఎన్నిక నిర్వహించడానికి నోటీసులు ఇచ్చారు. తెదేపా నుంచి గెలిచిన 9 మంది వార్డు సభ్యులు, ఐదుగురు వైకాపా వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అమరావతి తహసీల్దార్ శ్రీనివాస్ రావు అక్కడికి చేరుకుని వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఉప సర్పంచి ఎన్నిక జరగాల్సి ఉన్నపటికీ వైకాపా నేతలు రంగప్రవేశం చేశారు. నేతల ఒత్తిడి మేరకు తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి.. తహసీల్దార్ పంచాయితీ కార్యాలయం వద్దకు ఆంబులెన్సును పిలిచారు. తెదేపా తరపు వార్డు సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నిక నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు.

పోలీసులు అక్కడికి చేరుకొని వార్డు సభ్యులను లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోరం లేదని ఉప సర్పంచ్ ఎన్నికను.. తహశీల్దార్ వాయిదా వేయడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు.

ఇదీ చదవండి:

మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపాకు 52.63 శాతం ఓటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.