LIVE: వరద సాయం తర్వాత మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - AP Nominated Posts
🎬 Watch Now: Feature Video
AP Nominated Posts 2024 : ప్రభుత్వం ఆర్టీసీ, పౌరసరఫరాలు, ఏపీఐఐసీ, వక్ఫ్ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు ఛైర్మన్‌లతో పాటు ఆర్టీసీకి వైస్‌ఛైర్మన్‌ను కూడా నియమించింది. వీటిలో ఏడు కార్పొరేషన్లలో 64 మంది సభ్యులకు చోటు కల్పించింది. మిగతా 13 కార్పొరేషన్లకు ప్రస్తుతానికి ఛైర్మన్లను మాత్రమే ప్రకటించింది.రాష్ట్రంలో ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల పంపకానికి అనుసరించిన సూత్రాన్నే, ఈ పోస్టుల భర్తీలోనూ వర్తింపజేసింది. టీడీపీ నుంచి 16 మందిని ఛైర్మన్లుగా, 53 మందిని సభ్యులుగా, జనసేన నుంచి ముగ్గురిని ఛైర్మన్లుగా, తొమ్మిది మందిని సభ్యులుగా, బీజేపీ నుంచి ఒకరిని ఛైర్మన్‌గా, ఐదుగురిని సభ్యులుగా నియమించారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పోస్టు టీడీపీకు దక్కింది. ఇది తొలి విడత మాత్రమే. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, నియోజకవర్గ స్థాయి వరకు ఇంకా భారీగా నామినేటెడ్ పోస్టులు, వివిధ దేవాలయాలకు పాలకమండళ్లను ప్రకటించాల్సి ఉంది. వాటికీ ప్రస్తుత విధానంలోనే మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనుంది.
Last Updated : Sep 25, 2024, 1:35 PM IST