ETV Bharat / state

తెనాలి ప్రభుత్వాస్పత్రి శవాగారం: దుర్వాసనతో శవాలను చూడకుండానే తిరుగుముఖం! - తెనాలి ప్రభుత్వాస్పత్రి శవాగారం: దుర్వాసనతో శవాలను చూడకుండానే తిరుగుముఖం

జిల్లాలోనే గుంటూరు తర్వాత అతిపెద్ద జిల్లా ఆస్పత్రిగా పేరుగాంచిన తెనాలి వైద్యశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. శవాలను భద్రపరిచే విషయంలో సరైన యంత్ర పరికరాలు లేక మృత దేహాలను ఎక్కడబడితే అక్కడ పడేస్తున్నారు. ప్రమాదాల కారణంగా చనిపోయిన వారి మృతదేహాల కోసం వచ్చిన వారి కుటుంబీకులు.. అక్కడ వస్తున్న దుర్వాసన భరించక.. కనీసం అక్కడ నిలుచోలేక.. వెనుదిరుగుతున్నారు.

తెనాలి ప్రభుత్వాస్పత్రి శవాగారం: దుర్వాసనతో శవాలను చూడకుండానే తిరుగుముఖం

author img

By

Published : May 11, 2021, 3:25 PM IST

గుంటూరు జిల్లా తెనాలి.. ప్రభుత్వ ఆస్పత్రిలో శవాగారం నిర్వహణలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అపరిశుభ్రత తిష్ట వేసింది. ఫ్రీజర్లులు మోరాయించిన కారణంగా.. సిబ్బంది మృతదేహలను కుటుంబ సభ్యులు, సంబంధికులు తీసుకువెళ్లే వరకు.. అపరిశుభ్రంగా ఉన్న శవాగారంలోనే పడేసి సరిపుచ్చుతున్నారు.

ఆస్పత్రి నిర్వహణపై విస్మయం..

ఆ భౌతికకాయాలను తీసుకెళ్లేందుకు వచ్చిన వారు ఆస్పత్రి నిర్వహణ తీరు తెన్నులు చూసి విస్మయానికి గురవుతున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నెలకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంత పెద్ద మొత్తం ప్రజాధనం వెచ్చించినప్పటికీ.. నిర్వహణలో ఇసుమంతైనా మార్పు లేకపోవడంపై బాధితులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

40 మంది పని 20 మందితో..

జిల్లా కరోనా ఆస్పత్రిలో పారిశుద్ధ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. 40 మందితో చేయించాల్సిన పారిశుద్ధ్య పనిని కేవలం 20 మందితోనే చేయిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల వార్డుల్లో వ్యర్ధాలు తీయడం.. శవాగారాన్ని శుభ్రం చేయించడం వంటి విధులు నిర్వహించే వ్యక్తి మానేసిన కారణంగా.. ఆ పనిని తమతోనే చేయిస్తున్నట్లు మహిళా కూలీలు వాపోతున్నారు.

వారు ముందుకు రావడం లేదు..

ఆడ పనివారు శవాగారాన్ని శుభ్రం చేయడానికి ముందుకు రాకపోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. ఫలితంగా దారుణమైన మురికి కూపం లాగా మారి తీవ్ర దుర్వాసనతో రోగాలకు నిలయంగా మారుతోందని అక్కడి వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

శుభ్రం చేయించమని చెప్పా.. లేకుంటే చర్యలే..

శవాగారంలోని పారిశుద్ధ్య నిర్వహణపై శానిటరీ ఇన్స్పెక్టర్ కు శుభ్రం చేయాలని సూచించాను. వెంటనే శుభ్రం చేయకపోతే వారిపై చర్యలు తీసుకుంటాను. - డాక్టర్ సౌభాగ్య వాణి, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి, తెనాలి

ఇవీ చూడండి:

ఆ పసి మనసుకేం తెలుసు..? అమ్మలేదని.. తిరిగి రాదని..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.