గుంటూరు జిల్లా తెనాలి మండలంలో నివర్ తుపాన్‌తో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య పరిశీలించారు. పంట నష్టం వివరాల నమోదు చివరి దశలో ఉందని, రైతుల పేర్లు జాబితాలో లేకపోతే రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు అందజేయాలని అధికారులకు సూచించారు.
ఈ నెల 15 వ తేదిన జాబితా ప్రకటిస్తామని చెప్పారు. నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం రాయితీతో మినుము, పెసర విత్తనాలు అందజేస్తామన్నారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఆమె వెంట సంయుక్త కలెక్టర్ దినేశ్ కుమార్ ఉన్నారు.
ఇదీ చదవండి