ETV Bharat / state

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'కు నిరసనగా 10న కలెక్టరేట్ ముట్టడి! - ఉక్కు కర్మాగారం కాపాడుకునేందుకు గుంటూరులో పలు పార్టీల కలెక్టరేట్ ముట్టడి

గుంటూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో.. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ నెల 10న ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.

all parties round table meet at guntur
గుంటూరులో వివిధ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Feb 7, 2021, 5:46 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించనుండటంపై.. గుంటూరులో వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నేతలు భగ్గుమన్నారు. ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ చేబుల్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట అన్ని పార్టీలు ధర్నా చేపట్టాలని తీర్మానించారు.

ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది బలిదానం చేసిన చరిత్ర ఉందని.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించిన అంశమని వక్తలు అభిప్రాయపడ్డారు. కర్మాగారాన్ని కాపాడుకుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సభలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు రసవత్తరం.. పసిబిడ్డతో అభ్యర్థి ప్రచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.