గుంటూరు చుట్టుగుంట కూడలిలో పోలీసులు తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. ఇన్నోవా కారులో తరలిస్తుండగా మద్యాన్ని పట్టుకున్నామని నగరంపాలెం సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి లక్ష 20 వేల రూపాయలు విలువ 480 మద్యం సీసాలను, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి.
108 సిబ్బంది మానవత్వం.. కరోనా బాధితురాలికి ప్రసవం