ఇదీ చూడండి:
వినుకొండలో కిలో గంజాయి పట్టివేత - police take over marijuna at vinukonda
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం అంబేద్కర్ నగర్లో ఓ వ్యక్తి నుంచి పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానాస్పదంగా తిరుగుతున్న పులి సుబ్బారావు అనే వ్యక్తిని ఎక్సైజ్ సిబ్బంది తనిఖీ చేయగా.. కిలో గంజాయి బయటపడింది. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన శ్రీను అనే వ్యక్తి నుంచి తీసుకున్నట్టు నిందితుడు చెప్పాడు. గంజాయి, నాటుసారా లాంటి మత్తు పదార్థాలు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని.... వాటిని అమ్మిన వారు శిక్షార్హులని సీఐ హెచ్చరించారు.
పోలీసుల అదుపులో నిందితులు