ETV Bharat / state

Police Stopped Amaravati Farmers: రాజమండ్రికి పయనమైన రాజధాని రైతులు.. ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు - Amaravati Farmers Protest on CBN Arrest

Police Stopped Amaravati Farmers: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపడుతున్న ఆయన సతీమణి భువనేశ్వరికి మద్దతు తెలిపేందుకు రాజధాని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వివాదం నెలకొంది.

Police_Stopped_Amaravati_Farmers
Police_Stopped_Amaravati_Farmers
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 1:16 PM IST

Police Stopped Amaravati Farmers: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో దీక్షలు చేపడుతున్న ఆయన సతీమణి భువనేశ్వరికి( (Nara Bhuvaneswari Initiation in Rajamahendravaram) మద్దతు తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు రాజధాని రైతులు రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు. తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు, మహిళలు ప్రత్యేక బస్సుల్లో రాజమండ్రికి పయనమయ్యారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైలులో నిర్బంధించినదని, ఇలాంటి క్లిష్ట సమయంలో తామంతా భువనమ్మకు అండగా ఉంటామని రైతులు తెలిపారు.

వీరంతా మధ్యాహ్నం తర్వాత రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. భువనేశ్వరిని పరామర్శించి.. సంఘీభావం ప్రకటించనున్నారు. అయితే రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరిని పరామర్శించేందుకు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో రాజధానిలోని వివిధ గ్రామాల నుంచి బయల్దేరిన రాజధాని రైతులను నల్లజర్ల టోల్​గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి లేదంటూ బస్సులను నిలిపివేశారు. బస్సు డ్రైవర్లను బలవంతంగా పోలీసులు దించేశారు.

Amaravati Farmers Protest on CBN Arrest: బాబు అరెస్టుపై భగ్గుమన్న అమరావతి రైతులు.. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు..

దీంతోపాటు రాజమండ్రి బయలుదేరిన ఇంకొంతమంది రైతుల బస్సులను వీరవల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిలిపివేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను కలిసి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసుల తీరుపై రాజధాని రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తామేమి పాకిస్థాన్ నుంచి రాలేదని, రాష్ట్ర రాజధాని మహిళలైన తాము.. రాజమహేంద్రవరం వెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకోవాలంటూ పోలీసులతో వాదనకు దిగారు.

పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమను ఏకారణంతో అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులు తమకు కొత్త కాదంటూ, కావాలంటే తమను అరెస్టు చేసుకోవాలని రాజధాని మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతుల నిరసనతో వీరవల్లి టోల్ ప్లాజా వద్ద రైతుల బస్సులను పోలీసులు ముందుకు అనుమతించారు.

TDP Leaders Candle Rally: చంద్రబాబుకు మద్దతుగా విరజిమ్మిన వెలుగులు.. కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలతో తమ అధినేతకు సంఘీభావం

కాగా.. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరం వేదికగా నిరశన దీక్ష చేశారు. క్వారీ సెంటర్ వద్ద.. సత్యమేవ జయతే పేరుతో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగింది. ముందుగా రాజమహేంద్రవరం కంభాలచెరువు వద్ద గాంధీ విగ్రహానికి భువనేశ్వరి నివాళులు అర్పించి.. ఆ తర్వాత దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించారు. రాజమహేంద్రవరంలో భువనేశ్వరికి చిన్నారులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత శ్రేణులనుద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు.

Satyameva Jayate Deeksha in London: చంద్రబాబు కోసం.. లండన్ పార్లమెంట్ ముందు 'సత్యమేవ జయతే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.