గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొండుబొట్ల వారి పాలెంలో స్థల వివాదంలో చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసు స్టేషన్ కు పిలిపించారు. జూన్ 6వ తేదీన కేసు నమోదు చేశారు. శనివారం విచారణకు పిలిపించగా ఎస్సై ఎదుటే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం పొన్నూరులో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి : 'రాజధాని మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారా?'