మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో బుధవారం పలు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కోడెల తనయుడు శివరాంకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొవిడ్ దృష్య్టా ఎలాంటి కార్యక్రమాలు చేయడానికి వీలులేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసులపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబపరంగా జరిగే వర్ధంతి కార్యక్రమానికి నోటీసులు సరికాదన్నారు. యథావిధిగా కార్యక్రమాలు చేపడతామని శివరాం స్పష్టం చేశారు.
ఇదీచదవండి